భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో నటించింది. అయితే ఈమె ఈ సినిమాతో పెద్దగా పాపులారిటీని సొంతం చేసుకోలేదు. ఆ తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చిన ఈ ముద్దుగుమ్మకు అక్కడ వరుస అవకాశాలు వెలువడ్డాయి. అయితే తాజాగా పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ , రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా సినిమాలో ఈమె అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే. సినిమాల పరంగా బిజీగా ఉన్న కియారా అద్వానీ ఏ విషయం అయినా సరే అభిమానులతో పంచుకోవడానికి వెనుకాడదు. ఈ క్రమంలోనే తాను ఎవరిని ప్రేమిస్తున్నానో బయట చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎట్టకేలకు పెళ్లి తేదీని ప్రకటించింది.
ఈమె ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రాన్ని ప్రేమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇతడితో పెళ్లికి సిద్ధమైనట్లు స్పష్టం చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వీరిద్దరూ గత కొంతకాలం నుంచి డేటింగ్ లో ఉన్నారు. అయితే ఈ వ్యవహారాన్ని కూడా వీరు ప్రత్యక్షంగా ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాదిలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చినా.. ఇంకా ఈ విషయాలపై నటి కియారా ఏ విధంగా స్పందించలేదు. కానీ తాజాగా ఈమె షేర్ చేసిన పోస్ట్ చూస్తూ ఉంటే త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని అర్థమవుతుంది.
సోషల్ మీడియా వేదికగా కియారా స్పందిస్తూ.. ఈ విషయాన్ని దాచలేక పోతున్నాను.. డిసెంబర్ రెండవ తేదీ వరకు వేచి ఉండండి అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె పెళ్లి తేది డిసెంబర్ రెండవ తేదీన ప్రకటించబోతుందని.. పెళ్లి కూడా ఈ డిసెంబర్ ఐదో తేదీన చేసుకోబోతున్నారు అంటూ వార్తలు బాగా వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఇది చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
View this post on Instagram