మనకి తెలియకుండా మనమే ఇబ్బందులు ఇరుక్కుంటూ ఉంటాము. మన ఇంట్లో ఏదో ఒక సమస్య నిత్యం కలుగుతూనే ఉంటుంది. ఆరోగ్య సమస్య, అశాంతి ఇలా ఏదో ఒకటి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనమే ఇబ్బందుల్లోకి కూరుకు పోవాల్సి ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ కలిగే విధంగా ఎప్పుడు మనం ఫాలో అవ్వకూడదు. ఎల్లప్పుడూ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్టు చూసుకోవాలి. రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక బకెట్లో నీళ్లు నింపి ఆ నీటిని వంటగదిలో పెడితే అద్భుతమైన లాభాలను పొందడానికి అవుతుంది.
రాత్రి నిద్ర పోయేటప్పుడు వంటగదిలో ఇలా బకెట్ నీళ్లని పెడితే రుణ బాధల నుండి బయట పడవచ్చు. జీవితం లో పురోగతికి మార్గం తెరుస్తుంది. కాబట్టి ప్రతి రోజు కూడా రాత్రిపూట ఈ విధంగా పాటించండి రాత్రిపూట వంటగదిలో మనం తిన్న పాత్రలు వంటివి ఉంచకూడదు వాటిని తీసేయాలి. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకోవాలి అంతేకానీ వాటిని అలా వదిలేయకూడదు. సామాన్లని శుభ్రం చేయలేకపోతే మీరు కనీసం నీరు పోసి కడిగేయండి. అలా ఉంచండి.
అంతేకానీ ఆహారంతో పాటు అలా వదిలేయొద్దు ఇలా చేయడం వలన నెగటివ్ ఎనర్జీ తొలిగిపోతుంది. కాబట్టి ఈ తప్పు కూడా చేయకుండా చూసుకోండి. అదేవిధంగా ఇంటి ముఖద్వారం చాలా ముఖ్యం. ముఖద్వారం దగ్గర అందంగా ఉండాలి ఎప్పుడు చెత్తాచెదారం వంటివి పెట్టకూడదు ఇంటి ముఖద్వారం దగ్గర శుభ్రత చాలా ముఖ్యము. ఇంటి ఎదురుగా డస్ట్ బిన్ పెట్టడం వంటివి చేయకూడదు ఇవి ఇబ్బందుల్లోకి మిమ్మల్ని నెట్టేస్తాయి. కాబట్టి వీటిని కచ్చితంగా ఫాలో అవ్వండి నెగటివ్ ఎనర్జీ కి దూరంగా ఉండి హాయిగా ఉండండి.