బీజేపీ నేతలు ఈటల, డీకే అరుణ గృహనిర్బంధం

-

జంట నగరాల్లో పోలీసులు బీజేపీ నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారు. బాటసింగారంలో రెండు పడక గదుల ఇళ్ల పరిశీలనకు వెళ్తామని నేతలు ప్రకటించిన నేపథ్యంలో.. జంట నగరాల్లో ఈ హౌస్‌ అరెస్టులు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను హైదరాబాద్‌లో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈటలతో పాటు ఆ పార్టీ అగ్రనేత డీకే అరుణ, పలువురు బీజేపీ నేతలను గృహ నిర్బంధం చేశారు.

తమను గృహ నిర్బంధం చేయడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ సర్కార్ ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. డబుల్ బెడ్​రూం పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సొమ్ము వృథా చేస్తోందని ఆరోపించారు. నిజంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం పని చేసే ప్రభుత్వమే అయితే.. తమను రెండు పడక గదుల ఇళ్లను పరిశీలించేందుకు ఎందుకు వెళ్లనీయడం లేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news