ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. నిజానికి వాస్తు ప్రకారం అనుసరించడం వలన చాలా సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు వీటిని కనుక అనుసరిస్తే చాలా సమస్యల నుండి బయట పడొచ్చు. వాస్తు ప్రకారం ఆఫీసుకి సంబంధించి కొన్ని నియమాలని అనుసరించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం మీ కెరియర్ లో సక్సెస్ ని పొందాలన్నా మీ కెరియర్ లో ముందుకు వెళ్లాలన్నా ఈ మార్పులు చేసుకోండి అప్పుడు కచ్చితంగా అభివృద్ధి చెందగలరు.
వాస్తు శాస్త్రం ప్రకారం మీరు కూర్చునే పొజిషన్ కూడా మీ భవిష్యత్తుపై ఎఫెక్ట్ చూపిస్తుంది వాస్తు ప్రకారం కాలి మీద కాలు వేసుకుని కూర్చోకూడదు. హై చైర్ ని ఉపయోగించడం వలన మీ కెరియర్ లో మీరు బాగా ముందుకు వెళ్ళగలరు.
అలానే వెదురు మొక్కని ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకుంటే కూడా త్వరగా మీరు పైకి వెళ్ళగలరు.మీరు ఉపయోగించే లాప్టాప్, స్మార్ట్ఫోన్ల డైరెక్షన్ కూడా ముఖ్యం. ఈశాన్యం వైపు కూర్చుని మీరు వీటిని ఉపయోగిస్తే కచ్చితంగా సక్సెస్ ని పొందగలరు.అలానే మీ బెడ్ రూమ్ పక్కన మీరు వర్క్ ఫ్రొం హోమ్ చేయకూడదు ఇది మీ యొక్క పని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది..
అలానే వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళు డిసిప్లిన్ గా పని చేయాలి.రెక్టాంగిల్ ఆకారంలో ఉండే టేబుల్ వంటివి కానీ స్క్వేర్ ఆకారంలో ఉండే వాటిని ఉపయోగించాలి. గుండ్రంగా ఉండే వాడకండి. గుండ్రంగా ఉండే వాటిని ఉపయోగించడం వలన నెగటివ్ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది.చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలని మరి వీటిని అనుసరించి ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండండి.