చాలా మంది వాస్తు ని అనుసరిస్తూ వుంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు వుండవు. వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటే కూడా మంచి వస్తుంది. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. మనకి ఈ రోజు వాస్తు పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు. మరి వాటి కోసం ఈ రోజు తెలుసుకుందాం.
గులాబీ పూలు కూడా ప్రేమని సూచిస్తూ ఉంటాయి. ఈరోజు మనతో వాస్తు పండితుల గులాబీ పూల కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలని పంచుకోవడం జరిగింది. ఇవి ఆనందాన్ని తీసుకువస్తాయని అదృష్టాన్ని కలిగిస్తాయని పండితులు అంటున్నారు. ఒకవేళ కనుక ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నట్లయితే గులాబీ పూలు ద్వారా వాళ్ళు ఆర్థిక సమస్యల నుండి బయటపడచ్చని వాస్తు పండితులు అంటున్నారు.
సాయంత్రం పూట దేవుడికి హారతి ఇచ్చినప్పుడు గులాబీ పువ్వు మీద కర్పూరం వేసి వెలిగిస్తే మంచిది. అలానే శుక్రవారం నాడు తమలపాకులు మీద గులాబీ రేకులని పెట్టి దుర్గాదేవికి సమర్పిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి గులాబీలు పెట్టి పూజించడం వలన కూడా చాలా మంచి కలుగుతుంది. 11 శుక్రవారాలు ఇలా చేస్తే ఆనందం ఉంటుంది. అలానే వ్యాపారంలో కూడా నష్టాలు ఉండవు ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే చాలా చక్కటి ఫలితాలని పొందొచ్చు.