వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యలు అయినా కూడా తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయ్యి.. పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అయితే పాజిటివ్ ఎనర్జీ కలిగి మంచి కలగాలంటే కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలను పాటించాలి దీంతో వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.
వాస్తు ప్రకారం నవరాత్రుల సమయంలో పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ప్రతి రోజు ఉదయం సాయంత్రం రెండు పూట్లా కూడా హారతి కర్పూరంని ఇంట్లో వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఎంతో మంచి కలుగుతుంది. నెగటివ్ ఎనర్జీ అంతా దూరమైపోతుంది.
అదేవిధంగా నవరాత్రి సమయంలో అఖండ జ్యోతిని వెలిగిస్తే ఎంతో మంచి కలుగుతుంది. నవరాత్రి సమయంలో అఖండ జ్యోతిని వెలిగించేటప్పుడు నెయ్యి లేదా నూనె వేసి వెలిగించండి. అదృష్టం వస్తుంది. అదేవిధంగా మంచి కలగాలంటే ఒక కుండలో నిండా నీళ్లు పోసి అందులో పూలను వేయండి దీనివల్ల కూడా మంచి కలుగుతుంది.
నవరాత్రి సమయంలో అమ్మవారికి ఎర్రటి పూలు పెడితే మంచిది. అమ్మవారికి ఇష్టమైన మందార పూలు, కలువ పూలు పెడితే మంచి కలుగుతుంది. అలానే నవరాత్రి అప్పుడు వంటల్లో వెల్లుల్లి, ఉల్లిపాయని వద్దు ఇలా ఈ విధంగా ఫాలో అయితే మంచి కలుగుతుంది సమస్యలేవైనా ఉన్నాకూడా తొలగిపోతాయి.