చిన్న దొరకి బాసర IIIT ఇప్పుడు గుర్తుకు వచ్చిందా – వైయస్ షర్మిల

-

పఠాన్ చేరు నియోజకవర్గము జిన్నారంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో వైయస్ షర్మిల మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు. చిన్నదొర కేటీఆర్ కు ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటి గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు.

విద్యార్థులు శాంతియుతంగా పోరాటాలు చేస్తున్నా మీ ప్రభుత్వం ఎందుకు చేయనీయలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగు లక్షల కోట్ల అప్పులో ముంచారని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఇప్పటివరకు ఎలాంటి న్యాయం చేయలేదని అన్నారు. పట్టపగలు నడి రోడ్డుమీద లాయర్ కుటుంబ సభ్యులను అతి కిరాతకంగా నరికి చంపినా ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. వీఆర్ఏల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు.

మహిళా సంఘాలకు 0 వడ్డీకే రుణాలు అన్నారు.. అది కూడా దిక్కు లేదని అన్నారు. అసలు ఈ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ ఉందా? అని ప్రశ్నించారు. అర్హులైన వారికి అధికారుల ద్వారా దళిత బంధు ఇవ్వాలి.. కానీ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులకు ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు మరోసారి గిరిజన బందు అని ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తున్నారని అన్నారు. అసలు కెసిఆర్ ఇచ్చిన ఒక్క మాటనైనా నిలబెట్టుకున్నాడా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news