‘#VD18’ బిగ్ అప్‌డేట్.. కీర్తి సురేష్ పోస్ట్ వైరల్

-

కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.’నేను శైలజ’ మూవీస్‌తో తెలుగు తెరకు పరిచమైన కీర్తి సురేష్ , తక్కువ సమయం లో మంచి పేరు సొంతం చేసుకుంది. అలనాటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ చిత్రంలో నటించి ఎంతో మంది హృదయాలను దోచుకుంది.ఇక ఇటీవల మెగా స్టార్ చిరంజీవి ‘భోళ శంకర్’ సినిమాతో ఆకట్టుకున్న కీర్తి.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అలాగే తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ నిర్మాతగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తుంది.కలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్  నటిస్తున్నాడు.

ఇక ‘#VD18′ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ పనులు జరుగుతున్న ఈ మూవీ నుంచి బిగ్ అప్‌డేట్ ఇచ్చింది కీర్తి సురేష్.ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలో ”#VD18′ మూవీ నుంచి బిగ్ అప్‌డేట్ రేపు మధ్యాహన్నం 2 గంటలకు ఉంది’ అంటూ పోస్ట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version