వీర నారీ : రోదసిలో అడుగు పెట్టాలనుకుంది.. కట్ చేస్తే ప్రపంచంలోనే ఒకరిగా స్థానం..!

-

ప్రపంచంలో ఏదైనా కొత్తగా సాధించాలని కుతూహలం.. ఆత్రుత ప్రతి ఒక్కరిని అత్యున్నత స్థానానికి చేర్చుతోంది అని చెప్పవచ్చు . మనిషి ముఖ్యంగా ఆధునిక కాలం అందుబాటులోకి వచ్చిన తర్వాత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో మనిషి అంతరిక్ష రంగంలో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే చంద్రుడి మీద కాలు పెట్టడమే కాదు అంగారకుడు మీద నివాసయోగ్యమైన ప్రాంతాల కోసం అన్వేషణ జరుపుతున్నాడు. ఎందుకంటే రోజురోజుకు భూమి మీద జనావాసన పెరుగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో కలలకు కార్యరూపం దాలుస్తున్నాడు. అంతేకాదు అంతరిక్ష రంగాన్ని విహారయాత్రలకు, పర్యాటకానికి వేదిక చేయాలని భావిస్తున్నాడు.

ఈ మధ్యకాలంలో విద్యారంగంలో అనేక మార్పులు రావడంతో అంతరిక్ష పరిశోధక సంస్థలు సైతం రకరకాల కార్యక్రమాల ద్వారా వ్యోమగాములను నియమించుకుంటుంది. ఈ నేపథ్యంలోనే భారత సంతతికి చెందిన మహిళ రోదసిలోకి అడుగు పెట్టాలనే లక్ష్యంతో అడుగులు వేసి ప్రపంచంలోనే 12 మందిలో ఒకరిగా స్థానం సంపాదించుకోవడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ అయినటువంటి నాసా ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి కేరళకు చెందిన అతిర ప్రీతి రాణి ఎంపికయ్యారు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేస్తే కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న మూడవ భారతీయ నారీమణిగా అతిర చరిత్ర రికార్డుల్లోకి ఎక్కనుంది.

కేరళ రాష్ట్రం తిరువనంతపురానికి చెందిన వి.వేణు – ప్రీతిల కుమార్తె అతిర. అంతరిక్షం, ఖగోళ శాస్త్రం పై ఆసక్తి పెంచుకున్న ఈమె త్రివేండ్రంలో ఆస్ట్రానామికల్ సొసైటీ శిక్షణ తరగతులకు హాజరయ్యేవారు. ఇక అనంతరం కెనడాలోని అల్గోనిక్విన్ కాలేజీలో స్కాలర్షిప్ తో రోబోటిక్ కోర్సులో సీటు సాధించారు. తన ఖర్చులకోసం తల్లిదండ్రులపై ఆధారపడకుండా పార్ట్ టైం ఉద్యోగం చేస్తూనే మంచి మార్కులతో కోర్స్ లో విజయవంతంగా పూర్తి చేసి, ఇదే సమయంలోనే ప్రేమలో పడిన అతిర తాను ఇష్టపడిన గోకుల్ ను వివాహం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత ఎక్సో జియో ఏరోస్పేస్ కంపెనీ పేరుతో కెనడాలో స్టార్ట్ అప్ ప్రారంభించిన ఈమె మాత్రం రోదసిలో అడుగు పెట్టాలనే తన కలను నేరవేర్చుకోవాలనే లక్ష్యాన్ని వదులుకోలేకపోయారు.

ఇక అలా నాసా కెనడా స్పేస్ ఏజెన్సీ, నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడాలు నిర్వహించే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోనాటికల్ సైన్స్, ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి దరఖాస్తు చేసి ఆమె ఉత్తీర్ణత సాధించారు. అంతేకాదు నాసా ఆస్ట్రోనాట్ ప్రోగ్రాం కి ప్రపంచంలోనే పలు దేశాల నుంచి ఎంపికైన 12 మందిలో అతిర ఒకరిగా ఘనత సాధించడం భారతావనికే గర్వకారణం అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news