వెంకటేష్ పవిత్రుడేం కాదు.. రానా, అభిరామ్ కూడా అదే దారి.. డైరెక్టర్ గీతాకృష్ణ వైరల్ కామెంట్స్

-

టాలీవుడ్ స్టార్ హీరోల్లో వివాదాలకు దూరంగా ఉండే నటుడు విక్టరీ వెంకటేష్ తన పని తాను సైలెంట్ గా చేసుకుపోయే ఈ హీరో ఎక్కువగా పబ్లిక్ పార్టీలో సైతం కనిపించరు. సినిమా ఆడియో ఫంక్షన్ వంటి వాటికి వచ్చిన ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయరు. ఇలాంటి వెంకటేష్ పైన తాజాగా టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ గీతాకృష్ణ సంచలనం వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది.

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ గీతా కృష్ణ తాజాగా విక్టరీ వెంకటేష్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వెంక‌టేష్‌తో పాటు ఆయ‌న అన్న సురేష్ బాబు త‌న‌యులు హీరో రానా, అభిరామ్‌ల‌పై కూడా ఆయ‌న ఘాటుగా వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. తాజాగా వెంకటేష్, రానా కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ పై స్పందించిన గీత కృష్ణ ఈ కామెంట్స్ చేశారు.

Celebrate Rana Daggubati's 38th birthday with his forthcoming and ...

తాజాగా ఒక ఇంటర్వ్యూలో రానా నాయుడు వెబ్ సిరిస్ పై మాట్లాడిన గీతాకృష్ణ.. “నేను ఇప్పటివరకు రానా నాయుడు వెబ్ సిరీస్‌ను చూడ‌లేదు. అయితే త‌ప్ప‌కుండా చూస్తాను. అంద‌రూ అందులో బోల్డ్ కంటెంట్ ఉంద‌ని అంటున్నారు. అయితే అంద‌రూ వాళ్ల‌ని బోల్డ్ కంటెంట్‌లో ఎందుకు చేశార‌ని తిట్టేంత ప‌విత్రులు కారు వాళ్లు.. రియ‌ల్ లైఫ్‌లో వెంక‌టేష్ కానీ, రానా కానీ అంత ప‌విత్రులేం కాదు. బోల్డ్ కంటెంట్ చేస్తే త‌ప్పేంటి?. రానా చాలా మంది అమ్మాయిల‌ను ఫ్ల‌ర్ట్ చేస్తుంటాడు. అత‌ని త‌మ్ముడు అభిరామ్ కూడా అయితే ఇంకా ఘోరం. వాటినంతా ఒప్పేసుకుంటారు. కానీ బోల్డ్ కంటెంట్ చేస్తే ఒప్పుకోనంటే ఎలా.. రానా మ‌హా న‌టుడు ఏం కాదు క‌దా. మంచి న‌టుడంతే. బాహుబ‌లిలో చాలా బాగా యాక్ట్ చేశాడు. కానీ జ‌నాలు యాక్సెప్ట్ చేయ‌లేదు’’ అన్నారు. ఇవి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news