Saindhav : సైంధవ్ కోసం జెర్సీ భామ..!

-

విక్టరీ వెంకటేశ్.. చాలా కాలం తర్వాత యాక్షన్ మూవీతో సర్​ప్రైజ్ చేయడానికి వస్తున్నారు. హిట్‌’ లాంటి విజయవంతమైన సిరీస్‌ను అందించిన శైలేష్‌ కొలను దర్శకత్వంలో ‘సైంధవ్​’ పేరుతో వెంకీ తన 75వ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు.

ఇప్పటికే ఓ హీరోయిన్ గా రుహాని శర్మను సెలెక్ట్ చేయగా, మరో పాత్ర కోసం జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ ను కన్ఫామ్ చేసినట్లు సమాచారం. మూడో పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తోంది మూవీ యూనిట్. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికి ఇందులో కీ రోల్ పోషి స్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news