వన్డే వరల్డ్ కప్ 2027కు సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. 14 దేశాలు పాల్గొనే ఈ మెగాటోర్నీకి సంబంధించి ప్రస్తుతానికి సౌత్ ఆఫ్రికా లో జరగబోయే మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలు ఖరారు అయ్యాయి.దక్షిణాఫ్రికాలో ఐసీసీ గుర్తించిన మైదానాలు 11 ఉండగా ఇందులో 8 వేదికల్లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
డర్బన్‌లోని కింగ్స్‌మీడ్,జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్,గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్, ప్రిటోరియాలోని సెంచూరియన్ పార్క్, పార్ల్‌లోని బోలాండ్ పార్క్, కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ ,బ్లూమ్‌ఫోంటైన్‌లోని మాంగాంగ్ ఓవల్, ఈస్ట్ లండన్‌లోని బఫెలో పార్క్ లు వన్డే ప్రపంచకప్ 2027 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.ఈ విషయాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫోలెట్సీ మోసెకీ చెప్పారు. ఇక జింబాబ్వే, నమీబియాలో జరగనున్న మ్యాచ్‌లకు సంబంధించి త్వరలోనే వేదిక వివరాలను వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.2027 వన్డే ప్రపంచకప్‌లో మొత్తం 14 దేశాలు పాల్గొననున్నాయి. వీటిని రెండు గ్రూపులో విభజించారు.