వర్మ ‘మర్డర్’ ట్రైలర్.. ఎవ్వరిని వదలలేదుగా..!?

-

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే సినిమాలన్ని సంచలనం రేపుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అన్ని సినిమాలు వివాదాలకు కారణమవుతుంటాయి కాదు కాదు.. వివాదాలనే వర్మ సినిమాలుగా తీస్తూ ఉంటారు. అందుకే టాలీవుడ్ లో వర్మ సినిమాలు సృష్టించే హడావిడి మరే సినిమా సృష్టించలేదు అనడంలో అతిశయోక్తి లేదు. గతంలో అమృత భర్త ప్రణయ్ పరువు హత్య ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పరువు హత్య గురించి ఇప్పుడిప్పుడే అందరూ మరిచిపోతున్న తరుణంలో రామ్ గోపాల్ వర్మ ఈ స్టోరీని సినిమాగా తెరకెక్కించేందుకు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

మర్డర్ అనే టైటిల్ పెట్టి ఇది నిజ సంఘటనల ఆధారంగా రూపొందించినది అంటూ వర్మ సంచలనం సృష్టించారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశారు రామ్ గోపాల్ వర్మ. ట్రైలర్లు ఒక్కొక్క పాత్రను చూపిస్తూ… ప్రణయ్ హత్యకి ముందు ఏం జరిగింది హత్య తర్వాత ఏం జరిగింది అని పలు సంఘటనలను చూపిస్తూ వచ్చారు రాంగోపాల్ వర్మ. మొత్తం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది ఈ ట్రైలర్.

Read more RELATED
Recommended to you

Latest news