హెపటైటిస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

-

జీవ మానవాళీ పెరుగుతున్న కొద్ది కొత్త కొత్త రోగాలు, వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. భయంకర వైరస్ లు పుట్టుకొచ్చి ప్రాణాలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ కూడా అలాంటిదే. ప్రాణాంతకమైన రోగాల్లో హైపటైటిస్ ఒకటి. అంతర్జాతీయ హెపటైటిస్ డే సందర్భంగా ఈ వ్యాధి గురించి మరన్ని విషయాలు తెలుసుకుందాం.

Hepatitis
Hepatitis

ప్రపంచ హెపటైటిస్ డే అని దీని కంటు ఓ రోజు కేటాయించారంటే ఇది ఏ రేంజ్ లో విజృంభించి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏడాది జూలై 28వ తేదీన ప్రపంచ హెపటైటిస్ డేను జరుపుకుంటారు. ఈ రోజు ఈ వ్యాధిపై ప్రత్యేక అవగాహన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీంతో ఈ వైరస్ బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తుంటారు.

కాలేయంలో కొవ్వు పెరిగితే హెపటైటిస్ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీన్ని హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా అంటారు. ప్రస్తుత తరణంలో ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సాధారణంగా మానవ శరీరంలోని కాలేయంలో కొంత కొవ్వు ఉంటుంది. మోతాదుకు మించి కొవ్వు పేరుకుపోతే హెపటైటిస్ బారిన పడే ప్రమాదం ఎక్కువ. మనిషి ఆల్కహాల్ ను సేవించడం ద్వారా ఒక రకమైన కొవ్వు తయారైతే.. ఆల్కహాల్ తాగకుండా కుండా వేరే రకం కొవ్వు ఉత్పన్నం అవుతుంది. శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించుకోవడానికి తరచూ యోగాలు, ఎక్సర్ సైజ్ లు చేస్తూ అధిక బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.

ప్రస్తుతం జంక్ ఫుడ్ కు ప్రజలు అలవాటు పడ్డారు. ఆయిల్ ఎక్కువగా వాడి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, ఫ్రైలు చేసుకోవడంతో వల్ల శరీరంలో, లివర్ లో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. లివర్ లో కొవ్వు పెరిగితే మంటగా అనిపిస్తుంది. అది చివరకు ప్రాణాలు తీసే ప్రమాదం కూడా ఉంది. ఈ హెపటైటిస్ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే కాలేయంలో కొవ్వు శాతం పెరుగుతున్న విషయం పూర్తిగా పాడై, బాగు చేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడే ఈ లక్షణాలు బయట పడుతాయి. అందుకే దీనిని సైలంట్ కిల్లర్ గా అని పిలుస్తారని డాక్టర్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news