ప్యూన్ ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న మాజీ క్రికెట్ కెప్టెన్

-

ఇండియ‌న్ ఫిజిక‌ల్లీ చాలెంజ్డ్ క్రికెట్ టీం కెప్టెన్‌గా ప‌ని చేసిన దినేష్ సైన్ తాజాగా ప్యూన్ ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. నేష‌న‌ల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా)లో ఖాళీగా ఉన్న ఒకే ఒక్క ప్యూన్ పోస్టుకు అత‌ను తాజాగా ద‌రఖాస్తు చేశాడు. కాగా దినేష్ 2015 నుంచి 2019 మ‌ధ్య‌లో ఇండియ‌న్ ఫిజిక‌ల్లీ చాలెంజ్డ్ క్రికెట్ టీంకు మొత్తం 9 మ్యాచ్‌లు ఆడాడు. అదే స‌మ‌యంలో అత‌ను టీమిండియా కెప్టెన్‌గా కూడా ప‌నిచేశాడు.

indian physically challenged cricket team captain applied for peon post at nada

ప్ర‌స్తుతం దినేష్‌కు 35 ఏళ్లు. కాగా ప్ర‌భుత్వ ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అత‌నికి ఇదే చివ‌రి అవ‌కాశంగా మారింది. త‌న భార్య‌, ఏడాది వ‌య‌స్సు ఉన్న కుమారున్ని పోషించుకునేందుకు త‌న వ‌ద్ద డ‌బ్బు లేద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు త‌న సోద‌రుడు త‌న బాగోగులు చూసుకున్నాడ‌ని, కానీ ఇప్పుడు త‌న‌ను ఆదుకునేవారు లేర‌ని అత‌ను వాపోయాడు. తాను కేవ‌లం 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు మాత్ర‌మే చ‌దివాన‌ని, త‌రువాత నుంచి క్రికెట్‌పై ఇష్టంతో ఆ ఆట ఆడుతున్నాన‌ని తెలిపాడు. ప్ర‌స్తుతం త‌న‌కు 35 ఏళ్ల‌ని, అంగ‌వైకల్యుర కోటాలో త‌న‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌చ్చేందుకు ఇదే చివ‌రి అవ‌కాశ‌మ‌ని తెలిపాడు.

కాగా దినేష్‌కు పుట్టుక‌తోనే పోలియో ఉంది. ఈ క్ర‌మంలో అత‌ను తాజాగా జిల్లా కోర్టులో ప్యూన్ ఉద్యోగానికి ఇంట‌ర్వ్యూకు కూడా వెళ్లాడు. అయినా ఆ ఉద్యోగం అతనికి రాలేదు. క‌నీసం ఈ ఉద్యోగం అయినా త‌న‌కు ఇప్పించాలని అత‌ను కోరుతున్నాడు. ఇక 2015లో బంగ్లాదేశ్‌లో జ‌రిగిన 5 దేశాల టోర్నీలో దినేష్ 8 వికెట్లు తీశాడు. అత‌ని కోచింగ్‌లో 2019లో ఇంగ్లండ్‌లో భార‌త్ సిరీస్ గెలిచింది. త‌న‌కు ప్యూన్ ఉద్యోగం వ‌చ్చే విష‌యంలో స‌హాయం చేయాల‌ని అత‌ని కోరుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news