పిఠాపురం టీడీపీ ఇన్ చార్జీ, మాజీ ఎమ్మెల్యే వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఈసారి పవన్ కళ్యాణ్ కోసం తన సీటునే త్యాగం చేశారు. తనకు పార్టీలో కీలక పదవీ దక్కుతుందని భావించారు. పార్టీలో ఉంటే తప్పకుండా పదవులు అవే వస్తాయని నమ్మారు. అయితే ఆయన పై కొందరూ జనసేన నేతలు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారు దర్శనానికి ఆలయ అధికారులు నాకు అవకాశం ఇవ్వలేదని తెలిపారు. అలాగే అమ్మవారు ఆగ్రహానికి గురి కాకూడదని ఉద్దేశంతో మా కార్యకర్తలతో ఈరోజు అమ్మ దర్శనం చేసుకున్నామని వెల్లడించారు. వరలక్ష్మీ వ్రతానికి సంబంధించి టీడీపీ నాయకులు గాని, కార్యకర్తలకు కానీ ఎటువంటి కూపన్లు ఇవ్వలేదని తెలిపారు. ఆ రోజు భక్తులు అధికంగా వస్తారని కనీసం పూజకి కూడా ఆహ్వానం కూడా లేదన్నారు. కొందరూ టీడీపీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదన్నారు టీడీపీ నేత వర్మ.