మీకు చల్లని వార్త. మండు వేసవిని, ఈ ఉక్కపోతను ఎలా భరించాలిరా దేవుడా. ఇంకా ఎన్నిరోజులు ఈ కష్టాలు అని భయపడుతున్నారు కదా. మండుటెండల నుంచి ఉపశమనం పొందే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అవును.. మాన్ సూన్ సీజన్ ఈసారి తొందరగానే ప్రారంభం అవుతుందట.
ప్రతి సంవత్సరం జూన్ నెలలో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి కదా. అప్పుడే మనకు వర్షాలు ప్రారంభం అవుతాయి. అంతే కాదు.. ఎండ కూడా హుష్ కాకి అవుతుంది. ఈ సంవత్సరం.. వచ్చే నెల 4 న రుతుపవనాలు కేరళను తాకనున్నాయట. కేరళ తీరం నుంచి జులై మధ్య కాలంలో దేశమంతా అవి విస్తరిస్తాయట. ఈ విషయాన్ని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
కాకపోతే… గత ఏడాది కంటే కొంచెం ఆలస్యంగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనుండటంతో ఈ సంవత్సరం తక్కువ వర్షపాతం నమోదవుతుందట. దేశం మొత్తం మీద సగటున 93 శాతం వర్షపాతం నమోదవుతుందట.