చిన్నారికి అన్నం తినిపించి హీరో అయిన జవాన్.. వైరల్ వీడియో

-

జవాన్లు అంటే ఎవరు.. ఈ దేశాన్ని రక్షించేవాళ్లు. వాళ్లు వీరులు.. శూరులు. అంతే కాదు.. మానవత్వం ఉన్న మనుషులు కూడా అని నిరూపించాడు ఈ జవాన్.

కశ్మీర్ లో ఆకలితో ఉన్న ఓ చిన్నారికి తన లంచ్ బాక్స్ ఇవ్వడమే కాదు.. సొంత కొడుకుకు తినిపించినట్టు గోరు ముద్దలు పెట్టి తినిపించాడు ఓ జవాన్. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ జవాన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

శ్రీనగర్ లోని నవాకాదల్ ఏరియాలో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్పీఎఫ్ హవిల్దార్ ఇక్బాల్ సింగ్… డ్యూటీలో భాగంగా తిరుగుతుండగా… అతడికి ఓ చిన్నారి తారసపడ్డాడు. ఆ చిన్నారి ఆకలితో ఉన్నాడని గ్రహించిన జవాన్.. వెంటనే తన లంచ్ బాక్స్ తీసుకెళ్లి ఇచ్చి తినమన్నాడు. కానీ.. ఆ చిన్నారికి పెరాలసిస్ రావడం వల్ల తినలేడని గ్రహించి.. తానే తినిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… సీఆర్పీఎఫ్ ఔదార్యాన్ని మెచ్చిన ఆర్మీ అధికారులు.. ఆయనకు హ్యూమన్ అండ్ సెల్ఫ్ లెస్ యాక్ట్ సర్టిఫికెట్ అందించారు. ఆయన్ను సత్కరించారు.

ఫిబ్రవరి 14 న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి సమయంలో ఇక్బాల్ అక్కడే ఉన్నాడు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లోనే ఓ వాహనాన్ని ఆయన డ్రైవ్ చేస్తున్నాడు. ఉగ్రదాడి సమయంలో గాయపడిన తోటి జవాన్లను వెంటనే ఆసుపత్రికి తరలించడంలో ఇక్బాల్ ఎంతో సాయపడ్డాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version