బీసీ, ఎస్సీలను భుజం తట్టి నడిపిస్తున్న వ్యక్తి జగన్ : రజనీ

-

పల్నాడు జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజనీ, అలీ పాల్గొన్నారు. అందులో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీలను భుజం తట్టి నడిపిస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను రాష్ట్రానికి నాలుగు దిక్కులుగా జగన్ భావిస్తారని చెప్పారు. బలహీన వర్గాలకు ఆత్మబంధువైన జగన్ ను మళ్లీ సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి, విద్యా కానుక వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.

vidadala rajini oscar performance at ycp public meeting

వైసీపీ ప్రభుత్వంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు తయారయ్యాయని తెలిపారు. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని చెప్పారు. 3 వేలకు పైగా వ్యాధులకు ఆరోగ్యశ్రీని వర్తింపజేశామని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా ఇంటి వద్దకే వైద్యం అందిస్తున్నామని చెప్పారు. మహిషాసురుని సంహరిస్తే దసరా చేసుకుంటామని… నరకాసురిని సంహరిస్తే దీపావళి చేస్తామని… తరతరాలుగా కొనసాగుతున్న అణచివేతను సంహరిస్తే అది సామాజిక సాధికార యాత్ర యాత్ర అని అన్నారు. పల్నాడు జిల్లాలో కొనసాగిన సామాజిక సాధికార యాత్ర బస్సు యాత్ర సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news