విదుర నీతి: జీవిత యుద్ధంలో గెలవాలంటే… ఈ ఒక్కటీ మరచిపోవద్దు..!

-

ప్రతి ఒక్కరికి పరిపూర్ణ జీవితాన్ని పొందాలని ఉంటుంది ఇటువంటి కోరికలు ఉంటే విదురునీతి ఆలోచనని ప్రేరేపిస్తుంది. జీవిత యుద్ధంలో గెలవాలంటే ఏం చేయాలి…? జీవితమనేది ఒక సమరం. ఈ సమరంలో కష్టం, సుఖం రెండు ఉంటాయి. మహాభారత సమయంలో విదురుడు తన విధానాలపై ప్రజలకి అవగాహన కల్పించడానికి ప్రయత్నించారు ఆయన మాటల్ని పాటించడం ద్వారా లైఫ్ లో సక్సెస్ ని సాధించవచ్చు. జీవితాన్ని భరించగలిగేలా విజేతగా నిలవడానికి సులభమైన మార్గాలని విదురుడు అందించారు అయితే లైఫ్ లో సక్సెస్ సాధించడానికి విదురుడు సూచించిన విధానం ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం.

చెడ్డ పనులకి దూరంగా ఉండడం ఎంతో ముఖ్యము. మంచి పనులు చేస్తూ చెడ్డ పనులకి దూరంగా ఉంటే కచ్చితంగా మనం అనుకున్నది సాధించొచ్చు. మీరు కూడా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే చెడు పనులకు దూరంగా ఉండి మంచి పనుల్ని చేయండి. మొహం, క్రోధం, దురాశ అనేవి మూడు లక్షణాలు. ఈ మూడు కూడా నరక ద్వారాలు ఈ మూడు ఆత్మని నాశనం చేస్తాయి. ఈ మూడింటికి ఎప్పుడు దూరంగానే ఉండాలి అని అన్నారు. అలానే ఎవరైనా మిమ్మల్ని గౌరవించినా లేకపోతే ప్రశంసించిన సంతోషించొద్దు.

ఎవరైనా మిమ్మల్ని అగౌరవపరిస్తే వారిపై కోపం తెచ్చుకోవద్దు. ఎప్పుడూ కూడా రెండు సందర్భాల్లో సమదృష్టితోనే ఉండాలి అదే జ్ఞాని లక్షణం. జీవితంలో అనుకున్నది సాధించాలంటే మనస్ఫూర్తిగా పనిచేయాలి మనస్ఫూర్తిగా పనిచేస్తే కచ్చితంగా అనుకున్నది సాధించడానికి అవుతుంది. ఆరోగ్యంతో బాధపడే వ్యక్తి ధన నష్టాన్ని భరించాలి. వ్యాధి నుండి విముక్తి పొందడం గొప్ప ఆనందం అని విదురుడు చెప్పారు అలానే ఎప్పుడు సోమరులకి సహాయం చేయకూడదు సోమరితనం ద్వారా సంపదను నాశనం చేస్తాడు ఆ వ్యక్తి. మనం సహాయం చేయడం వల్లే సోమరి అవుతాడు ఆ వ్యక్తి. కాబట్టి ఈ తప్పును కూడా చేయకండి ఇలా విదురుడు చెప్పినట్టు చేస్తే కచ్చితంగా జీవితం బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news