లైగెర్ సినిమా ఇటు పూరి జగన్నాథ్ ను అలాగే విజయ్ దేవరకొండ ను బాగా దెబ్బ కొట్టింది. ఈ సినిమాకు పూరీ కంటే విజయ్ ఎక్కువ కష్టపడ్డాడు. తన మేక్ ఓవర్ గాని , సినిమా ప్రమోషన్ ను తన భుజాల మీద వేసుకొని కష్టపడ్డాడు. తన సినిమా ను పాన్ ఇండియా సినిమా గా ప్రమోట్ చేశాడు. కాని వారి ఆశలు తలకిందులు అయ్యి సినిమా ప్లాప్ గా నిలిచింది. పూరి జగన్నాథ్ మళ్లీ హోటల్ లో కూర్చొని కథలు రాసుకుంటున్నాడు.తాజాగా తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని కథలు వింటున్నాడు. కాని ఎప్పుడైనా ఒక సినిమా స్టార్ట్ అయిన వెంటనే ఎక్కువ మంది హీరోలు రెండో సినిమా లైన్ లో ఉంచు కుంటారు.కాని ప్రస్తుతం తర్వాత సినిమా పై క్లారిటీ లేకుండా పోయింది. అదే లైగెర్ హిట్ అయి వుంటే మనోడు బాలీవుడ్ లో పాగావేసేవాడు. ఇప్పుడు తెలుగు లో పెద్ద దర్శకులు కూడా ఎవరూ ఖాళీగా లేరు. దీనివల్ల ఇప్పుడు విజయ్ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు.