ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఆవు.. వీడియో వైరల్‌..!

-

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఉండేంత క్లీనింగ్‌, కేరింగ్‌ ఉండదని చాలా మంది అనుకుంటారు. తాజాగా.. మధ్యప్రదేశ్‌లోని రాజగఢ్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహణ లోపాలను ఎత్తిచేపే వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. రాజగఢ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఆవు స్వేచ్ఛగా తిరుగుతుంది. ఒక ఆవు హాస్పిటల్‌లోని ఐసీయూలో, కారిడార్లో తిరుగుతున్న దృశ్యాలను ఒక వ్యక్తి వీడియో తీశాడు. అప్పుడు ఆ ఐసీయూలో కొందరు పేషెంట్లు కూడా ఉన్నారు. ఆ సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డ్ కానీ, వార్డు బాయ్ కానీ ఎవరూ లేరు.

ఆ ఆవును అక్కడి పేషెంట్లకు సంబంధించిన ఒక వ్యక్తి బయటకు పంపించాడు. అక్కడ యథేచ్చగా తిరగడంతో పాటు అక్కడి డస్ట్ బిన్‌లలో ఉన్న మెడికల్ వ్యర్థాలను ఆ ఆవు తినడం అనేది ఇంకా ఆందోళన కలిగించే విషయం..

యాజమాన్యం ఏమంటుంది..?

ఆవులు, ఇతర పశువులు ఆసుపత్రిలోకి రాకుండా చూసేందుకు ఇద్దరు ఉద్యోగులను ప్రత్యేకంగా నియమించామని, అయితే ఆ ఆవు వచ్చిన సమయంలో వారు అక్కడ లేరని హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలిపారు. వారిపై చర్యలు తీసుకోనున్నామన్నారు. ఈ హాస్పిటల్ పట్టణానికి దూరంగా ఉండడంతో ఇక్కడ పశువుల బెడద ఎక్కువగా ఉంటుందట.. ఈ వీడియో ఘటన వల్ల ఒక సెక్యూరిటీ గార్డ్, ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఆ ఆవు వెళ్లింది పాత కవిడ్ ఐసీయూ అని వివరించారు.

గతంలో కూడా..

ఇలాంటి ఘటనే గతంలో మధ్యప్రదేశ్‌లో కూడా ఒకటి జరిగింది. రత్లాం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల బెడ్‌పై ఒక కుక్క పడుకుని ఉన్న వీడియో సెప్టెంబర్ నెలలో వైరల్ అయింది. ఆ వీడియోను చూపిస్తూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు చేసింది. ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాదు..ప్రభుత్వ వసతిగ్రహాల్లోనూ నిర్వహణ లోపం ఉంటుంది. హాస్టల్‌ గదల దగ్గరే కుక్కలు ఉంటాయి..డస్ట్‌బిన్‌లో వేసిన వ్యర్థాలను కుక్కలు కిందపడేసి ఆగం ఆగం చేసిన ఘటనలు ఎన్నో..

Read more RELATED
Recommended to you

Latest news