Vijay Devarakonda – Liger : రౌడీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌..‘లైగర్’ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్..

-

Vijay Devarakonda – Liger: ఇండ‌స్ట్రీలో చాలా త‌క్కువ కాలంలో స్టార్ డామ్‌ను పొందిన వారిలో ఒక‌రు టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ. అర్జున్‌రెడ్డి చిత్రం తో యూత్ లో ఫుల్‌ క్రేజ్ సొంతం చేశాడు. నటుడు గానే కాకుండా బిజినెస్‌మేన్‌గానూ ఫుల్‌ ఫామ్‌లో ఉన్న దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న తాజా మూవీ లైగ‌ర్. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌తో తెర‌కెక్క‌నున్న‌ఈ చిత్రానికి క్రేజీ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్లు కలిసి నిర్మిస్తున్నారు. దీంతో ఈ చిత్రం ఏవిధంగా ఉండ‌బోతుంద‌న‌నే ఆస‌క్తి సినీ అభిమానులకు ఉంటుంది.

ఆ ఊహలు, అంచనాలకు తగ్గట్టుగా ప్యాన్ ఇండియన్ స్థాయిలో లైగర్ అంటూ విజయ్ దేవరకొండతో మ్యాజిక్ చేసేందుకు పూరి రెడీ అయ్యాడు. ఈ చిత్రం కోసం పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రో వైపు.. తెలుగు, హిందీతో పాటు మిగతా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి ఈ సినిమాకు రూ. 200 కోట్ల భారీ ఆఫర్ చేసిన‌ట్టు తెలుస్తుంది.

ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కనిపిస్తారట.అలాగే… రమ్యకృష్ణ కూడా ఓ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించనున్న‌ది. ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్‌ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రానున్న‌ట్టు ఓ పోస్టు చేశారు చిత్ర యూనిట్. ఏంటో అప్డేట్ అని చాలా ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు రౌడీ ఫ్యాన్స్‌. ఇదిలాఉంటే.. ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్‌‌లో నట సింహా బాలకృష్ణ కూడా సడెన్ విజిట్ చేసి సర్‌ఫ్రైజ్ చేశారు. చిత్ర బృందంతో సంద‌డి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news