ముస్లింలకు దళిత బంధు ఇవ్వాల్సిందే : ఓవైసీ

-

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగురవేసేందుకుగాను అధికార టీఆర్ఎస్ పార్టీ ‘దళిత బంధు’ స్కీమ్ పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్‌లో లాంచ్ చేసింది. స్వయంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి వచ్చి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వనుంది సర్కార్‌. అయితే… ఈ దళిత బందు పథకం తీసుకువచ్చినప్పటి నుంచి…తమకు కూడా రూ.10 లక్షలు ఇవ్వాలని అన్ని కులాల నుంచి డిమాండ్‌ వస్తోంది.

ఇక తాజాగా ఈ దళిత బంధు స్కీం పై హైదరాబాద్ ఎం పి అసదుద్దీన్ ఓ వైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వున్న 1%శాతం ముస్లింలలో దళిత బందు పథకాన్ని ముస్లిం లకు వర్తింప జేయాలని డిమాండ్‌ చేశారు ఓవైసీ. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 48% ముస్లిం కుటుంబాలు నెలకు రూ. 10 వేల కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బంధు పథకంలో ముస్లిం లను చేర్చడం వల్ల వెనుక బాటు నుండి బయట పడొచ్చని తెలిపారు. కాబట్టి ముస్లిం కుటుంబాలకు కూడా దళిత బంధు ఇవ్వాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news