విజయ్ దేవరకొండ ఫాన్స్ ని బుట్టలో వేసిన బన్నీ…!

-

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈ మధ్య సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అతను స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. కొన్నాళ్ళుగా విజయ్ రౌడీ బ్రాండ్ పేరుతో దుస్తుల వ్యాపారంలో దిగిన సంగతి తెలిసిందే. ‘రౌడీ’ బ్రాండ్‌కు సంబంధించిన దుస్తులను ఇస్తానని గతంలో బన్నీకి విజయ్ మాట ఇచ్చాడు.

జనవరి 11న బన్నీ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా నేపధ్యంలో బన్నీకి శుభాకాంక్షలు చెబుతూ రౌడీ బ్రాండ్ టీషర్ట్స్‌ను విజయ్ గిఫ్ట్ ఇచ్చాడు. వాటిని తానే డిజైన్ చేశా అని, బన్నీకి రాసిన లేఖలో విజయ్ వివరించాడు. ఈ గిఫ్ట్‌ను తీసుకున్న అల్లు అర్జున్ ‘‘మై డియర్ బ్రదర్ థ్యాంక్యూ, మాటిచ్చినట్లుగానే రౌడీ బ్రాండ్ దుస్తులను పంపించావు,

వీటిని ‘అల వైకుంఠపురములో’ సెలబ్రేషన్‌లో ధరిస్తానని బన్నీ రిప్లయ్ ఇచ్చాడు. ఇక ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉంటున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సహా మెగా హీరోలు అందరితో సన్నిహితంగా ఉంటున్నాడు. రౌడీ దుస్తులు పంపిన విధానం, వాటికి అల్లు అర్జున్ రిప్లయ్ ఇచ్చిన విధానం చూస్తే, బన్నీ విజయ్ దేవరకొండ ఫాన్స్ ని బుట్టలో వేసుకున్నాడని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news