గంటా… విజయసాయిని మోసం చేసారా …?

-

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఎక్కువగా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు దేశం పార్టీ లక్ష్యంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్కువగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రంగా ఉంది. ఈ తరుణంలో కొందరు ఎమ్మెల్యేలను వైసీపీలోకి తీసుకురావాలని విజయసాయి ప్రయత్నాలు చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ నేతలు అందరూ కూడా…

ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కువగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆ పార్టీని కంట్రోల్ చెయ్యాలి అంటే కీలక నేతలను వైసీపీలోకి తీసుకోవడమే మంచిది అనే అభిప్రాయం వైసీపీలో వ్యక్తమవుతుంది. ఈ నేపధ్యంలోనే వైసీపీ కీలక నేతగా ఉన్న విజయసాయి గంటా శ్రీనివాసరావు ని టార్గెట్ చేసినట్టు సమాచారం. ఈ నెల 15 న ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తారని భావించారు విజయసాయి.

కాని గంటా మాత్రం పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపించలేదు. ఇక కొడుక్కు మంచి పదవి ఇస్తామని… మీరు పార్టీలో చేరవద్దు అని చంద్రబాబుని విమర్శిస్తే చాలు అని… కొడుకుకి వైసీపీ జెండా కప్పుతామని విజయసాయి వ్యాఖ్యానించారట. దీనికి ముందు గంటా ఓకే చెప్పినా సరే ఆ తర్వాత ఏమైందో ఏమో గాని రాలేను అని చెప్పినట్టు సమాచారం. అందుకే గంటా లక్ష్యంగా విజయసాయి ఆరోపణలు చేసారని అంటున్నారు.

విశాఖకు రాజధానిగా మార్చే విషయంలో విజయసాయి గంటా మద్దతు కోరారు. గంటా కు బలమైన నేతగా అక్కడ గుర్తింపు కూడా ఉంది. దీనితో ఆయన వస్తే విశాఖలో స్థానిక టీడీపీ నేతలు అందరూ వచ్చే అవకాశం ఉందని విజయసాయి భావించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది బాగా కలిసి వస్తుందని ఆయన ఆశించినా సరే అది అంతగా ఫలించలేదు అని అంటున్నారు

Read more RELATED
Recommended to you

Latest news