పుష్ప సినిమాకు నో చెప్పిన విజయ్ సేతుపతి…!

-

టాలీవుడ్ లో ఇప్పుడు చర్చలు అన్నీ కూడా పుష్ప సినిమా గురించే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా గురించి ఆసక్తి పెరుగుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఇటీవల విడుదల చేయగా దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ లుక్ లో అల్లు అర్జున్ ని చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. తమ ఇమేజ్ ని పక్కన పెట్టి ఈ సినిమాను చెయ్యాలి అని భావించడం ప్రసంశలు.. కురిపిస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతిని తీసుకోవాలని భావించారు. దానికి కారణం ఏంటీ అంటే చిత్తూరు జిల్లాలో జరిగే ఎర్ర చందనం సంగ్లింగ్ కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అక్కడ తమిళనాడు ప్రభావం ఉంటుంది. చిత్తూరు కి తమిళనాడు తో ఎక్కువ సంబంధాలు ఉంటాయి. దీనితో విజయ్ ఉంటే సినిమాకు ఎక్కువగా కలిసి వస్తుందని భావించి సుకుమార్ తీసుకోవాలి అనుకున్నాడు.

కాని విజయ్ సేతుపతి ఈ సినిమాను చేయడానికి నో అన్నట్టు సమాచారం. ఈ సినిమా తాను చేయలేను అని చెప్పాడట. దానికి కారణం అతనికి బిజీ షెడ్యుల్ ఉండటమే. తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ హీరోగా తెరకెక్కుతున్న `మాస్టర్` చిత్రంలో కూడా విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే సాయిధరమ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ `ఉప్పెన`లోనూ విజయ్ సేతుపతి విలన్‌గా కనిపిస్తున్నాడు. దీనితోనే ఇప్పుడు ఈ సినిమాను వద్దని భావించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news