కిట్లు ఇవ్వకపోవడానికి చైనా కుట్ర ఇదేనా…?

-

మన దేశంలో కరోనా వైరస్ ప్రభావం దెబ్బకు ఇప్పుడు మన ఆర్ధిక వ్యవస్థ అనేది భారీగా దెబ్బ తినే పరిస్థితిలో ఉందీ అనే విషయం అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు కావడం తో పరిస్థితులు భయపెడుతున్నాయి. ఇప్పుడు కరోనా పరిక్షలు వేగంగా జరిగితే కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది సాధ్యమవుతుంది. ఈ తరుణంలో కరోనా వైరస్ టెస్ట్ కిట్ల మీద దేశం ఎన్నో ఆశలు పెట్టుకుంది.

చైనా నుంచి ఈ కిట్స్ రావాల్సి ఉంది. దాదాపు 20 లక్షల కిట్లను మనకు చైనా ఇవ్వాల్సి ఉంది. దీనిని ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేసింది చైనా. అసలు ఎప్పుడు ఇస్తాం అనేది చైనా చెప్పడం లేదు. యూరప్ దేశాలకు ఇస్తుంది చైనా. లక్షల్లో పరిక్షలు చేస్తే కరోనా వైరస్ కట్టడి అవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే మన దేశానికి చైనా ఇవ్వకుండా ఉండటానికి గానూ ప్రధాన కారణం ఏంటీ అనేది చూస్తే…

మన దేశ ఆర్ధిక వ్యవస్థ ఎంత బలహీనపడితే చైనా అంత లాభపడే అవకాశం ఉంటుంది. అందుకే మన దేశానికి చైనా ఇవ్వడం లేదు. మన దేశం క్రమంగా ఆర్ధికంగా బలపడటంతో చైనా ఇబ్బంది పడుతుంది. ఇక్కడి ఉత్పత్తులు కూడా చైనా ను ఇబ్బంది పెడుతున్నాయి. మెకిన్ ఇండియా ఉత్పత్తులతో కొన్ని రాష్ట్రాల్లో చైనా దిగుమతులు ఆగిపోయాయి అనే వార్తలు వస్తున్నాయి. అందుకే చైనా మనకు కిట్స్ ఇవ్వడం లేదని… లాక్ డౌన్ ని పొడిగించే విధంగా చైనా వ్యవహరిస్తుంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news