స్పీకర్‌ పై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు…ఇప్పుడే నిద్ర లేచారు!

ఢిల్లీ : లోక్‌సభ స్పీకర్‌ పై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహారిస్తోందని ఫైర్‌ అయ్యారు. శరద్ యాదవ్ విషయంలో నోటీసులు ఇచ్చి.. వారం రోజుల్లోనే అనర్హత వేటు వేశారని గుర్తు చేసిన ఆయన…వైసీపీ.. ఏడాది క్రితం అనర్హత పిటిషన్ ఇస్తే… 11 నెలల తర్వాత స్పీకర్ నిద్ర లేచారని చురకలు అంటించారు.

ఉద్దేశ్య పూర్వకంగా కాలయాపన చేస్తూ… కొద్దీ రోజుల క్రితం పిటిషన్ లో లోపాలు ఉన్నాయి సరి చేయమని పంపారని ఫైర్‌ అయ్యారు. అనర్హత పిటిషన్ కు సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని… ఆ మార్గదర్శకాల ప్రకారం చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరామన్నారు.

మూడు నుంచి ఆరు నెలల కాలంలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పినా… బీజేపీకి అనుకూలంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి, ద్వంద్వ ప్రమాణాలు మార్చుకోవాలని హితువు పలికారు. కేంద్ర ప్రభుత్వం.. ఏపీపై చూపుతున్న సవతి తల్లి ప్రేమను, మొండి చేయి చూపడాన్ని, ద్వంద్వ ప్రమాణాలను మానుకోవాలని స్పష్టంగా చెప్పామని తెలిపారు.