తిరుమల తిరుపతి దేవుడికి సైతం పన్నులు వేస్తున్నారని కేంద్రం పై ఫైర్ అయ్యారు విజయసాయిరెడ్డి. ధరల పెరుగుదల పై రాజ్యసభలో చర్చ జరుగగా ఈ సందభారంగా విజయసాయి మాట్లాడారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది..తిరుమల తిరుపతి దేవుడికి సైతం పన్నులు వేస్తున్నారు.. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు.
పేద, మధ్య తరగతి ప్రజలపై ధరల భారం తీవ్రంగా ఉందని.. ప్రజల సామాజిక, ఆర్థిక రక్షణ బాధ్యత కేంద్రానిదేనని.. కరోనా వల్ల వెనక్కి వెళ్లిన ప్రజలు తిరిగి పనులకు రాకపోవడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయిందని తెలిపారు. బొగ్గు, నూనె ధరలు ఏడేళ్ల అత్యంత గరిష్ట స్థాయికి చేరాయి.. సెస్, సర్ చార్జి లలో రాష్ట్రాలకు ఎందుకు వాటా ఇవ్వరని మండిపడ్డారు.
కేంద్రం తన మొత్తం పన్నుల వాటాలో 41 శాతం వాటా ఇవ్వడం లేదు.. కేవలం 31 శాతం పన్నుల వాటా మాత్రమే రాష్ట్రాలకు అందుతోందని చెప్పారు. దీని వల్ల ఏడేళ్ల లో 46,000 కోట్ల రూపాయలు ఏపి నష్లపోయింది.. రాష్ట్రాల నుంచి సెస్, సర్ చార్జి రూపంలో కేంద్ర ప్రభుత్వం దోపిడీ చేస్తోంది.. పిపిఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లను పెంచాలని తెలిపారు. విదేశాలలో ద్రవ్యోల్బణం ఉందని కేంద్ర ప్రభుత్వం తనను తాను సమర్థించుకోవడం సరైంది కాదని మండిపడ్డారు.