Vijayasaireddy : కొత్త గెటప్ లో దర్శనమిచ్చిన విజయసాయిరెడ్డి

-

వైసీపీ రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటారు. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీపై ఏదో ఒక టాపిక్‌ ఎంచుకుని విమర్శలు చేస్తూ ఉంటారు విజయ సాయిరెడ్డి. అయితే.. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త గెటప్ లో దర్శనమిచ్చారు. గుండు గీయించుకుని… చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నారు విజయసాయిరెడ్డి.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా….”దేశంలోని కొన్ని థర్మల్ కేంద్రాలు ఏటా 22 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాయి. చైనా, ఆస్ట్రేలియాల్లో ఉత్పత్తి తగ్గింది. యుద్ధం వల్ల యూరప్ లో కరెంటు కొరత ఏర్పడటంతో ఇంపోర్టెడ్ కోల్ టన్ను రూ.22 వేలకు చేరి భగ్గుమంటోంది. సుంకాలు తగ్గించి కేంద్రం ఆదుకోవాలి” అని ట్వీట్ చేశారు విజయసాయి.

ఇక మరో ట్వీట్ లో “కరెంటు పోరు పేరుతో కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలని కుప్పంలోని ఒక గ్రామ కమిటీకి ఆర్డర్ వేశాడు బాబు. కరెంటేమో పోవడం లేదు. ఏదో ప్రమాదం జరిగిందని శాంతిపురం సబ్ స్టేషన్ కు ఫోన్ చేసి కరెంటు నిలిపివేయించారు. చీపు ట్రిక్కులతో ప్రజలను అవస్థలు పెడుతూ మళ్లీ ఏమొహం పెట్టుకుని వెళ్తారు బాబూ?” అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news