టిడిపిలో తిరుగుబాటు, అచ్చెన్న నాయకత్వం : వైసీపీ ఎంపి సంచలన వ్యాఖ్యలు

టిడిపి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ఎప్పుడూ వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు విజయసాయిరెడ్డి. టిడిపిలో తిరుగుబాటు వస్తుందని.. దానికి అచ్చెన్నే నాయకత్వం వహిస్తాడని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. “అచ్చెన్న కాలజ్ఞానం నిజమే అనిపిస్తోంది. టీడీపి తెలంగాణా అధ్యక్షుడు తెరాసలోకి జంప్ అట. ఇక్కడ కూడా అలాంటి గందరగోళమే ఉంది. జూమ్ మీటింగులతో పిచ్చెక్కి పోయిన నేతలు కఠిన నిర్ణయం తీసుకోకపోతే తమ ఫ్యూచర్ నాశనం అవుతుందని టెన్షన్ పడుతున్నారంట. అచ్చెన్నే నాయకత్వం వహిస్తాడా తిరుగుబాటుకు?” అంటూ విజయసాయిరెడ్డి వెల్లడించారు.

ysrcp mp vijayasai reddy
ysrcp mp vijayasai reddy

జగన్ గారు సిఎంగా ప్రమాణం చేసినప్పుడు హుందాగా అభినందించాల్సింది పోయి అనుభవం లేదని చంద్రబాబు అన్నాడని… ప్రజలు తప్పు చేశారని శోకాలు పెడుతున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు జనం మధ్యకు వెళ్లి అప్పటి మాటలు అనగలవా బాబూ అని ప్రశ్నించారు. నక్క జిత్తుల రాజకీయాల్లేవు…గ్రాఫిక్స్ మాయలు లేవని.. ప్రచార ఆర్భాటాలకు పోకుండా పనులు జరుగుతున్నాయన్నారు. ఇంత దివాళాకోరు రాజకీయాలకు తెగబడ్డావేంటి బాబు?.. చివరకు ఆనందయ్య వనమూలికల వైద్యాన్ని కూడా వివాదాస్పదం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఏ గుర్తింపుకు నోచుకోని దేశీయ వైద్యులు ఎంతో మంది ఉన్నారని… అలాంటి వారిని గుర్తించి వెలుగులోకి తీసుకురండి… మీకు పేరు రావడమే గాక.. సమాజానికి మేలూ జరుగుతుందని చురకలు అంటించారు.