లక్ష కోట్లు ఎలా సంపాదిస్తున్నారో సీఎం కెసిఆర్ చెప్పాలి – విజయశాంతి

-

 

లక్ష కోట్లు ఎలా సంపాదిస్తున్నారో సీఎం కెసిఆర్ చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు. ఆరోపణలను అనుసరించి సీబీఐ, ఈడీ ప్రశ్నలు అడగటం, అధికారులకు సమాధానం చెప్పడం ఒక చట్టపూర్వక ప్రక్రియ. నేరం లేనట్లయితే ఏ విధమైన సమస్యా ఉండదన్నారు. నేరం ఉంటే బాధ్యత తీసుకోక తప్పదని హెచ్చరించారు విజయశాంతి.

అయితే, బీఆరెస్ (టీఆరెస్) అధినేత, ఆ కుటుంబం సంపాదన, ఆస్తుల విషయానికి వస్తే… ఒకనాడు లక్ష రూపాయలు కూడా లేని వీరికి లక్ష కోట్లు ఎట్లా వచ్చాయనే కోట్లమంది తెలంగాణ ప్రజల అనుమానాలకు… కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి, ప్రాణాలొడ్డి పోరాడిన ఉద్యమకారులకు, ఆ త్యాగాలకు తప్పనిసరిగా సమాధానం చెప్పి తీరాలి. కేసీఆర్ గారితో ఆ సమాధానం చెప్పించే బాధ్యతను మాత్రం నాతో పాటు, ప్రతి బీజేపీ కార్యకర్తా ఊరూరా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు రాములమ్మ.

 

Read more RELATED
Recommended to you

Latest news