ప్రధాని మోడీ పర్యటనతో..తెలంగాణలో యూరియా కొరత తీరనుందన్నారు విజయశాంతి. ప్రధానమంత్రి మోడీ గారు మూడు సార్లు రాష్ట్రానికి వస్తే కేసీఆర్ కలవలేదు. కనీస మర్యాద ఇవ్వలేదు. కేసీఆర్‌కు అహంకారం పెరిగింది. ఆయన మాటలపై ప్రజలు నమ్మకం కోల్పోయారని ఫైర్ అయ్యారు.
రాజకీయ కారణాలతో రామగుండంలో ప్రధాని మోడీ గారి సభను అడ్డుకుంటామని కొన్ని పార్టీలు ప్రకటించడం సిగ్గు చేటు. దేశాభివృద్ధికి పాటుపడుతున్న ప్రధానిని అడ్డుకోవడమేంటి..? రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ తో రైతుల్లో భరోసా పెరిగింది. ఎలాంటి కొరత లేకుండా ఎరువులను పొందేందుకు అవకాశం వచ్చింది. 12.5 మిలియన్ టన్నుల ఉత్పత్తితో తెలంగాణలో యూరియా కొరత తీరుతుందనిచెప్పారు.
గతంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. ఇప్పుడు అలాంటి సమస్య ఉండదు. రామగుండం ఎరువుల కర్మాగారం తిరిగి ప్రారంభం కానుండడంతో రైతుల్లో భరోసా నిండింది. 12న ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు విజయశాంతి.