ఢిల్లీ సంగతి సరే…ముందు గల్లీలో మీ పరిస్థితి చూసుకోండి – విజయశాంతి సెటైర్లు

-

కేసీఆర్ సారూ….. ఢిల్లీ సంగతి సరే…ముందు గల్లీలో మీ పరిస్థితి చూసుకోండని విజయశాంతి సెటైర్‌ వేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దానని, యావత్ భారత దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తోందని మీరు చెబుతున్న గొప్పలు….. గప్పాలని మరోసారి నిరూపితమైందన్నారు.

ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించానని, ఇక దేశాన్ని ఉద్ధరిస్తానంటూ జాతీయ పార్టీ పెట్టడానికి సిద్ధమయ్యారు. మీ పాలన ఇక చాలని, మీకు సెలవు చెప్పే సమయం ఆసన్నమైందని సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ సర్వే (ఎస్ఎన్ఓఎస్)ను బట్టి కూడా స్పష్టమవుతోందని ఎద్దేవా చేశారు.

ప్రజాదరణ పొందుతున్న ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో డబల్ డిజిట్ (11వ స్థానం) లో ఉన్న మీకు రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు ఏమాత్రం లేదన్న సత్యాన్ని ఇకనైనా గ్రహించడం మంచిది. ఎలాగూ ఇంటికి పోవడం ఖాయమైంది….. అధికారంలో ఉన్న ఈ నాలుగు రోజులైనా ప్రజా సేవ చేయండి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయండి. శేష జీవితం ప్రశాంతంగా గడపడానికి దోహదపడుతుందని మా సూచన అంటూ చురకలు అంటించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news