తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పారు మంత్రి గంగుల కమలాకర్ రావు. ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన చేశారు మంత్రి గంగుల. భారీ వర్షాల కారణంగా ధాన్యం తడిసిందని.. అలాగే.. కోనుగోళ్లు కూడా ఆగిపోయాయని చెప్పారు. ఇది కేంద్రం వైఫల్యం వల్లే జరిగిందన్నారు. త్వరలోనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించారు.
తెలంగాణ సాధించిన కేసీఆర్.. ప్రజలకు మహారాజేనని… ధరణితో 98 శాతం సమస్యలు పోయాయన్నారు. ధరణి వల్లే భూ సమస్యలు తగ్గి గొడవలు తగ్గాయని.. త్వరలో జరిగే రెవెన్యూ సదస్సులో కొద్దిపాటి సమస్యలు కూడా 100% పరిష్కారమవుతాయన్నారు. కుర్చీ వేసి మౌన దీక్ష చేయాలంటే మోడీ ఇంటికి వెళ్దాం. నేనూ వస్తానని… అందరికీ 15 లక్షలన్న మోడీ కోసం ప్రతీ ఏటీఎం దగ్గ టర కుర్చీలు వేద్దామని వెల్లడించారు. ఉద్యోగాలు కల్పన నెరవేర్చనందుకు యూపీఎస్సీ దగ్గర కుర్చీవేద్దామని… గ్యాస్ ధర పెంచినందుకు ప్రతీ ఇంటిముందు కుర్చీ వేసి దీక్షచేద్దామని చెప్పారు.