కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

-

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిలైన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఈనెల 25న కుని ఆపరేషన్లు చేశారు. ఇందులో పలువురి ఆపరేషన్లు ఫెయిలై పరిస్థితి సీరియస్‌గా మారింది. మౌనిక, మమత, లావణ్య, సుష్మ అనే నలుగురు మహిళలు వివిధ ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా కలకలం సృష్టించింది. న్యాయం కోసం నిన్న బాధితులు రోడ్డెక్కారు. ఆపరేషన్ చేసిన డాక్టర్, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నరు. అయితే ఇద్దరు మహిళలు చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించిన అధికారులు… మరో ఇద్దరు కూడా మృతి చెందిన విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే డబుల్ పంచ్​డ్ ల్యాప్రోస్కోపిక్ అనేది కొన్ని నిమిషాల వ్యవధిలోనే పూర్తయ్యే సర్జరీ. కానీ ఈ సర్జరీలు చేసే డాక్టర్లు ప్రభుత్వ వైద్యరంగంలో సుమారు 20 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు.

వీళ్లే రాష్ట్రమంతటా తిరిగి క్యాంపులు పెట్టి ఒకే రోజు పదుల సంఖ్యలో సర్జరీలు చేస్తున్నరు. ఈ ఏడాది మార్చిలో యాదాద్రి-భువనగిరి జిల్లా హాస్పిటల్లో ఆపరేషన్ల కోసమని వచ్చిన 20 మంది మహిళలకు మత్తు మందు ఇచ్చి, ఆపరేషన్లు చేయకుండానే డాక్టర్లు వెళ్లిపోయారు. ఈనెల 27న సూర్యాపేటలోని మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్లో ఒకేరోజు వంద మందికి ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ తర్వాత అబ్జర్వేషన్ కోసం హాస్పిటల్లో ఉంచేందుకు బెడ్లు చాలక, వారిని బయట నేల మీద పడుకోబెట్టారు. ఇలా గంపగుత్తగా ఆపరేషన్లు చేసి, ఆ తర్వాత జాగ్రత్తగా చూసుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల మహిళలు ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. నోరెత్తితే ధనిక రాష్ట్రమని డబ్బా కొట్టుకునే సీఎం కేసీఆర్ ఈ విషయమై స్పందించాలని ఆగ్రహించారు విజయ శాంతి.

Read more RELATED
Recommended to you

Latest news