చాలా మంది వేసవిలో ఏదైనా టూర్ వెయ్యాలని అనుకుంటారు. వేసవిలో ఎక్కడికైనా వెళ్లాలని మీరు చూస్తున్నారా…? అయితే ఐఆర్‌సీటీసీ టూరిజం తీసుకు వచ్చిన టూర్ ప్యాకేజీని చూసేద్దాం. షిరిడీకి ప్రత్యేక టూర్ ప్యాకేజీలను తీసుకు వచ్చింది. దీనితో మీరు ఎంచక్కా సమ్మర్‌లో షిరిడీ టూర్ వేసి వచ్చేయచ్చు. విజయవాడ నుంచి ఈ టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. సాయి సన్నిధి పేరు తో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. పూర్తి వివరాల లోకి వెళితే.. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతీ మంగళవారం ఈ టూర్ మొదలు అవ్వనుంది. ఈ టూర్ ప్యాకేజీ రూ.5,000 లోపే వుంది.
సాయి సన్నిధి టూర్ ప్యాకేజీ ని కనుక బుక్ చేసుకుంటే పర్యాటకులు షిరిడీ లో సాయిబాబా ఆలయాన్ని చూసి రావచ్చు. అలానే దానితో పాటు శనిశిగ్నాపూర్ శనేశ్వర దేవస్థానాన్ని కూడా చూసి రావచ్చు. ప్రతీ మంగళవారం ఈ టూర్ మొదలు కానుంది. మొదటి రోజు విజయవాడలో ఈ టూర్ స్టార్ట్ అవ్వనుంది. ఉదయం 10.15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కాలి. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ రీచ్ అవుతారు. అక్కడ నుండి షిరిడీకి వెళ్లాల్సి వుంది. హోటల్ లో చెకిన్ అయిన తర్వాత షిరిడీలో సాయిబాబా ఆలయాన్ని చూసి రావచ్చు. సాయంత్రం షాపింగ్ చేయొచ్చు. రాత్రికి షిరిడీలో బస చేయాలి.
మూడవ రోజు షిరిడీ నుంచి శనిశిగ్నాపూర్ బయల్దేరాలి. శనిశిగ్నాపూర్ శనేశ్వర ఆలయాన్ని దర్శించుకోవచ్చు. తర్వాత తిరిగి షిరిడీ చేరుకోవాలి. తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో ట్రైన్ ఎక్కితే నాలుగో రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు విజయవాడ రీచ్ అవుతారు. ధర విషయానికి వస్తే.. ఐఆర్‌సీటీసీ షిరిడీ టూర్ ప్యాకేజీ ధర స్టాండర్డ్ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.4850, ట్విన్ షేరింగ్‌కు రూ.5,630 గా వుంది. అలానే కంఫర్ట్ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.7310, ట్విన్ షేరింగ్‌కు రూ.8,080 చెల్లించాలి.