రేవంత్ వ్యవహారంలో వికారాబాద్ ఎస్పీ బదిలీ..

-

తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ వ్యవహారంలో ఈసీ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వికారాబాద్‌ ఎస్పీ అన్నపూర్ణపై వేటు వేసింది. అర్థరాత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లడాన్ని తీవ్రంగ పరిగణించిన కాంగ్రెస్ పార్టీ మంగళవారం నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నపూర్ణను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్నపూర్ణ స్థానంలో వికారాబాద్‌ ఎస్పీగా 2005 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అవినాశ్‌ మహంతిని నియమిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది.

బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. అన్నపూర్ణకు ఎన్నికలతో సంబంధం లేని ఇతర బాధ్యతలను అప్పగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీచేసింది.
కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు కాంగ్రెస్ పార్టీ నేతల ఫిర్యాదు చేయడంతో. దీనిపై నివేదిక తెప్పించుకున్న ఈసీ.. ఈ మేరకు చర్యలు చేపట్టింది. అన్నపూర్ణను బదిలీ చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. అన్నపూర్ణను బదిలీ చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు కాస్త శాంతించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news