Vikrant Rona: ఓటీటీలోకి విక్రాంత్‌ రోణ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

-

శాండల్ వుడ్(కన్నడ) బాద్ షా..కిచ్చా సుదీప్ హీరోగా నటించిన అడ్వెంచరస్ త్రీ డీ ఫిల్మ్ ‘విక్రాంత్ రోణా’. అనుప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జాక్ మంజునాథ్ , శాలిని మంజునాథ్ ప్రొడ్యూస్ చేశారు. జులై నెల 28న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమా విడుదల అయింది.

ఈ ఫిల్మ్ లో స్టోరి, యాక్షన్ సీక్వెన్స్ , గ్రాఫిక్స్ వెరీ డిఫరెంట్ ఉండటంతో… సినిమా గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. కోట్ల కలెక్షన్లను రాబట్టింది ఈ సినిమా. వెరీ డిఫరెంట్ గెటప్ లో ఈ సినిమా కిచ్చా సుదీప్ కనిపిస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇందులో కీలక పాత్ర పోషించారు. ఇది ఇలా ఉండగా..ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫాం జీ 5 లో ఈ సినిమా సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జీ 5 ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news