ఎన్నికల వేళ ఆ గ్రామ వాసుల డిమాండ్ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే !

-

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలా అనే అనుమానం కలిగిస్తున్నాయి. ఎలా అయినా పట్టు నిలుపుకోవాలని అధికార వైసిపి ప్రయత్నిస్తుంటే తమ సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవడానికి టిడిపి ప్రయత్నిస్తోంది. అయితే ఎన్నికల సమయంలో మామూలుగా ఓటర్లు డబ్బులు తీసుకుని ఓటు వేయడం మనకు తెలిసిందే. కానీ ఎన్నికల సమయంలో విశాఖపట్నం జిల్లాలోని ఒక గ్రామస్తులు చేస్తున్న డిమాండ్ ఇప్పుడు అందరిని ఆలోచింప చేస్తోంది. అందరూ ఆ ఊరి గ్రామస్తులను హాట్సాఫ్ అనేలా చేస్తోంది.


వివరాల్లోకి వెళితే విశాఖపట్నం జిల్లా గూడెంకొత్తవీధి మండలం ధారకొండలో ఓటర్లు చేస్తున్న డిమాండ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. తమ ఊరిలో ఉన్న బడికి టీచర్లను ఇస్తేనే తాము ఓటు వేస్తామని లేకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. 180 మంది పిల్లలు ఉంటే కేవలం ముగ్గురు టీచర్లు మాత్రమే బడికి వస్తారని తమ పిల్లల భవిష్యత్తు కోసం మరికొంత మంది టీచర్లను తమ పాఠశాలకు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలా కేటాయిస్తేనే ఓటు వేస్తామని లేదంటే ఎన్నికలు బహిష్కరించడానికి కూడా సిద్ధమని వారు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news