ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ నటుడు విన్‌డీజిల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

-

హాలీవుడ్ నటుడు, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ హీరో విన్‌డీజిల్‌ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అతడి మాజీ సహాయకురాలు జొనాసన్ విన్ డీజిపై లైంగిక ఆరోపణలు చేయగా కేసు నమోదైంది. 2010లో ‘ఫాస్ట్‌ ఫైవ్‌’ సినిమా చిత్రీకరణ సమయంలో హోటల్‌ గదిలో ఈ ఘటన జరిగిందని లాజ్‌ ఏంజెల్స్‌ కోర్టులో జొనాసన్ వ్యాజ్యం దాఖలు చేశారు.

2010లో ఫాస్ట్‌ ఫైవ్ షూటింగ్ చిత్రీకరణ సమయంలో తన విధుల్లో భాగంగా ఆ మూవీ టీమ్తో కలిసి అంట్లాంటా వెళ్లాను. అక్కడ పని నిమిత్తం విన్ డీజిల్ వద్దకు వెళ్లాను. హోటల్ గదిలో నా అనుమతి లేకుండా విన్‌డీజిల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విన్‌ డీజిల్‌ సోదరి సమంతా విన్సెంట్‌కు ఈ విషయం చెప్పినా ఆమె పట్టించుకోలేదు. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. అని జొనాసన్ పిటిషన్లో పేర్కొంది.

దీనిపై ఆమె న్యాయవాది మాట్లాడుతూ.. విన్ డీజిల్ అసభ్య ప్రవర్తనను వ్యతిరేకించినందుకు జొనాసన్ ఉద్యోగాన్ని కోల్పోయారని స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. బలవంతులకు రక్షణ కల్పిస్తే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఎన్నటికీ ఆగవని చెప్పారు. తన వేదనను బయటకు చెప్పేందుకు ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయం శాశ్వత మార్పును తీసుకువస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news