ప‌వ‌ర్ స్టార్ కోసం వ‌స్తున్న వినాయ‌క్‌.. డైరెక్ట‌ర్‌గా కాదు న‌టుడిగా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమా వ‌స్తుందంటే చాలు ఇండ‌స్ట్రీ లెక్క‌లు మారిపోతాయి. ఇక ఆయ‌న గ్యాప్ తీసుకున్న త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా చేస్తున్న ప్రాజెక్టు అయ్యప్పణం కోషియం. త‌మిళ సినిమా అయిన దీన్ని ప్ర‌స్తుతం రీమేక్ చేస్తున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

ఇది రీమేక్ మూవీనే అయినా దీనిపై భారీ స్థాయిలో అంచ‌నాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్థాయిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే దీనికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు ఇండ‌స్ట్రీని ఊపేస్తోంది.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన వీవీ వినాయక్ ఫ‌స్ట్ టైమ్ ఈ మూవీలో ఓ రోల్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వయంగా చెప్పారు. తాజాగా ఆయ‌న ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను పవన్ క‌ల్యాణ్ రానా క‌లిసి చేస్తున్న అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ మూవీలో ఒక చిన్న రోల్ చేస్తానని, అందులో కూడా తాను ఒక డైరెక్టర్ గానే కనిపిస్తానంటూ వెల్ల‌డించారు. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ తెగ కుషీ అవుతున్నార‌. ఈ మూవీని సాగర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.