కాంగ్రెస్ ఎంపీకి అవ‌మానం.. ఏకంగా కేంద్రానికే ఫిర్యాదు చేశాడుగా!

-

కేసీఆర్ ఈ మ‌ధ్య వ‌రుస‌గా జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయిన ఆయ‌న అనూహ్యంగా వాసాల‌మ‌ర్రిని ద‌త్త‌త తీసుకున్న విష‌యంలో భాగంగా ఆయ‌న నిన్న ఆ ఊరికి వెళ్లారు. అంద‌రితో క‌లిసి భోజ‌నం చేశారు. కొన్ని అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను కూడా ప్రారంభించారు. దాంతోపాటే మ‌రిన్ని నిధులు ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు.

కాంగ్రెస్

అయితే ఇదే విష‌యంపై ఇప్పుడు ఓ ఎంపీ గుస్సా అయితున్నారు. కేసీఆర్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా త‌న‌కు ఎలాంటి ఆహ్వానం అంద‌లేద‌ని కాంగ్రెస్ ఎంపీ అయిన కోమటిరెడ్డి త‌న‌కు అవమానం జరిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో పర్యటించినా త‌న‌కు ఎలాంటి ఆహ్వానం ఇవ్వ‌లేద‌ని చెప్పారు.

ఇదే విష‌యంపై ఆయ‌న ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు చేసి సంచ‌ల‌నం సృష్టించారు. తన నియోజకవర్గ పరిధిలో సీఎం కేసీఆర్ నిర్వ హించిన అభివృద్ధి కార్యక్రమాలపై మాత్రం త‌న‌కు ఆహ్వానం ఇవ్వ‌కుండా అవ‌మానించార‌ని, అలాగే ప్రొటోకాల్‌ ఉల్లంఘించారని కాబ‌ట్టి అధి కారులపై క‌ఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. ఈ మేర‌కు మంగళవారం లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు ఆయ‌నే స్వ‌యంగా ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news