వైరల్: లైవ్‌లో యాంకర్‌ పై కూలిన సెట్టు

-

ఏదైనా వార్తను ప్రేక్షకుల ముందుకు రావాలంటే ముందుగా స్టూడియోలో సెట్స్ వేస్తుంటారు. తెర ముందు ఒక్కరు కనిపించడానికి తెర వెనకల చాల మంది కష్టం ఉంటుంది. ఇక కొద్దీ రోజుల క్రితం ఆదిపురుష్ సెట్ కాలిపోయిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా అదే తరుణంలో కొలంబియాలో దారుణం చోటు చేసుకుంది.

anchor
anchor

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొలంబియాలో లైవ్‌లో ఉన్న యాంకర్‌పై ఉన్నట్టుండి స్టూడియో సెట్టులోని ఓ భాగం కూలింది. అయితే అదృష్టవశాత్తు అతడికి పెద్దగా గాయాలేం కాలేదు. అయితే ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే.. యాంకర్‌పై సెట్టు కూలిన సమయంలో అక్కడ మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు వారిలో ఒక్కరు కూడా స్పందించలేదు. పైగా షో కంటిన్యూ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది..

అయితే కార్లోస్‌ ఓర్డుజ్‌ అనే యాంకర్‌ కొలంబియా ఈఎస్‌పీఎన్‌కు చెందిన ఒక షో ప్యానెలిస్టులలో సభ్యుడు. ఈ క్రమంలో ఈ నెల 10న షో నిర్వహిస్తుండగా.. సెట్‌లో ఉన్న భారీ మానిటర్ లాంటి నిర్మాణం అతనిపై పడింది. దాంతో అతడి ముఖం డెస్క్‌కు తగిలింది. ఈ ఘటనలో అతడు డెస్క్‌కు అతుక్కుపోయినట్లు కనిపించడం వీడియోలో చూడవచ్చు.

ఇక ఇదే షోలో ఓర్డుజ్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా పాల్గొన్నారు. యాంకర్‌పై సెట్‌ కూలడంతో వారు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఆ తర్వాత వారిలో ఒక వ్యక్తి తేరుకుని.. కాసేపు షోని కంటిన్యూ చేసి.. ఆ తర్వాత బ్రేక్‌ అని చెప్పి.. కట్‌ చేశాడు. వెంటనే ఓర్డుజ్‌ని లేపి ఆస్పత్రికి తరలించారు. అతడికి పెద్దగా గాయాలు కాలేదని తెలిపారు వైద్యులు. ఈ క్రమంలో తన గురించి కంగారు పడినవారందరికి ధన్యవాదాలు తెలిపాడు ఓర్డుజ్‌. సెట్‌ కూలిన ఘటనలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ఇక స్టూడియోలో ఉన్నవారంతా క్షేమంగానే ఉన్నానంటూ ట్వీట్‌ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news