ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అల్లకల్లోం సృష్టించింది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఈ వైరస్ బారి నుండి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇక కరోనా సమయంలో మాస్క్ ధరించడాన్ని ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. కొంతమంది ముఖానికి మాస్క్ ధరించడాన్ని విధిగా పాటిస్తున్నారు. మరికొంత మంది మాస్క్ వేసుకోవాడన్ని లేక్క చేయకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారు.
ఇక తాజాగా ఓ ఉబర్ డైవర్ తన కారులో ప్రయాణిస్తున్న మహిళను మాస్క్ ధరించాలని కోరగా ఆమె అతనిపై దాడికి దిగి, అసభ్యంగా ప్రవర్తించింది. ఈ ఘటన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుభాకర్ ఖాడ్కా అనే ఉబర్ డ్రైవర్ ఆదివారం బేవ్యూ ప్రాంతంలో ముగ్గురు మహిళలను తన కారులో ఎక్కించుకున్నాడు. కారులో కూర్చున్న ముగ్గురు మహిళల్లో ఓ మహిళ మాస్క్ ధరించలేదు. దీంతో ఉబర్ డ్రైవర్ సదరు మహిళను మాస్క్ ధరించాలని కోరాడు. దీంతో ఆ మహిళ కోపంగా డ్రైవర్ మీదకు వెళ్లుతూ కావాలని దగ్గటం ప్రారంభించింది.
అంతటితో ఆగకుండా తీవ్రంగా అరుస్తూ అతని మాస్క్, మొబైల్ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించింది. ఆ మహిళలు తమ గమ్యస్థానంలో కారు దిగి వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్పందించిన ఉబర్ సంస్థ ఇక సదరు మహిళకు ఉబర్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. డ్రైవర్ సుభాకర్ ఖాడ్కా మాట్లాడుతూ.. ఆ మహిళ కారులో తనపై పెప్పర్ స్ప్రే చల్లిందని తనకు శ్వాస తీసుకోవాడనికి చాలా ఇబ్బంది అయినట్లు తెలిపాడు. తనది నేపాల్‌దేశామని, ప్రయాణికులతో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించలేదని తెలిపాడు. తనది నేపాల్ దేశమని ఆ మహిళలు వివక్ష చూపి, దాడికి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.