వైరల్ పిక్: చెట్టుని పులి ఇంత ప్రేమిస్తుందా…?

రష్యాలోని ఒక అడవిలో ఒక చెట్టును కౌగిలించుకున్న సైబీరియన్ టైగర్ ఫోటోకి ఇటీవల ఒక అవార్డ్ వచ్చింది. సెర్గీ గోర్ష్కోవ్ ఇటీవల వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. ఈ ఫోటోకి ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. అయితే ఈ రోజు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఫోటోని పోస్ట్ చేసారు.Image

ముందు అవార్డ్ గెలుచుకున్న ఫోటోని పోస్ట్ చేసి ఆ తర్వాత మన ఇండియా పులి హగ్ చేసుకునే ఫోటోని పోస్ట్ చేసారు. ఇండియన్ వెర్షన్ పులి ఎలా హగ్ చేసుకుంటుందో చూడండి అంటూ ఈ పిక్ పంచుకున్నారు. దీనికి సోషల్ మీడియాలో చాలా మంచి స్పందన వచ్చింది.