రాత్రంతా అసెంబ్లీలోనే అప్ ఎమ్మెల్యేలు..కారణం ఇదే!

పంజాబ్‌లో రాజకీయం మొత్తం కొత్త వ్యవసాయ చట్టాల చుట్టే తిరుగుతున్నాయి..కేంద్రం తెచ్చిన కొత్త అగ్రి చట్టాలపై దేశంలో మిగతా రాష్ట్రాల రైతుల కంటే పంజాబ్‌ రైతులు ఎక్కువ ఆందోళన చేస్తున్నారు..కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకొవాలని దాదాను 25 రోజుల నుంచి నిరసనలు చేస్తున్నారు..తెలంగాణ సహా బీజేపీయేత పార్టీలు అసెంబ్లీ తీర్మాలు చేశాయి..
తాజాగా పంజాబ్‌ అసెంబ్లీ రోజు తీర్మానం చేయనుంది..అందుకు సంబంధించిన తీర్మానం అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది..దాంతో పాటు రాష్ట్రం యొక్క వ్యవసాయ చట్టాల ద్వారా కేంద్ర చట్టాలను తమలు చేయకుండా చూడాలని దానికి సంబంధించి..రాష్ట్రం కొత్త చట్టాలను తేవాలని యోచిస్తుంది..అయితే పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ వైఖరిని వ్యతిరేకిస్తూ ఆప్‌ ఎమ్మెల్యేలు సోమవారం రాత్రంతా అసెంబ్లీ భవనంలోనే ఉండి నిరసన తెలిపారు..మంగళవారం సభలో ప్రవేశపెట్టనున్న వ్యవసాయ చట్టాలకు సంబంధించిన ముసాయిదాను తమతో పంచుకోవాలని వారు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

దీంతో అసెంబ్లీ భవనంలోనే రాత్రంతా ఉండి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న వ్యవసాయ చట్టాలను ఉపయోగించడం ద్వారా నూతన చట్టాలను తిరస్కరించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోందని..ఈ నూతన వ్యవసాయ చట్టాలను ప్రతిపక్ష పార్టీ అయిన ఆప్‌ కూడా వ్యతిరేకిస్తోందని, అయితే పంజాబ్‌ ముఖ్యమంత్రి ఆ ముసాయిదా కాపీలను తమకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.