VIRAL VIDEO : సోఫాలో కూర్చుని ప‌డిపోయిన బాబాయ్ అబ్బాయ్..!

-

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కిందపడిపోయాడు. అచ్చేన్నాయుడు స్టేజిపై సోఫాలో కూర్చుని ఒక్కసారిగా వెనక్కి పడిపోయాడు. అచ్చెన్నాయుడు తో పాటు అదే సోఫా లో కూర్చున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఒక్కసారిగా కిందపడిపోయారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న పేరుతో కేంద్రం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. దీనికి సంబంధించిన కార్యక్రమానికి అచ్చెన్నాయుడు , రామ్ మోహన్ నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టిడిపి నాయకుల తో పాటు వైసీపీ నాయకులు కూడా హాజరయ్యారు. అక్కడ ఈ ఘటన చోటు చేసుకుంది.అప్పటికే రామ్ మోహన్ నాయుడు సోఫా లో కూర్చుని ఉండగా ఆ తరవాత అచ్చెన్నాయుడు కూర్చోగానే పడిపోయారు అయితే కింద పడిన సమయంలో ఇద్దరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. వెంటనే వెనక ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరిని పైకి లేపారు. ఆ తర్వాత యదా విధిగా పోస్టల్ స్టాంపు ఆవిష్కరణ జరిగింది. అయితే సోఫా ను సరిగ్గా వేయకపోవడం వల్లనే ఇలా జరిగిందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.https://youtu.be/NSxZsE4Gi2s?t=8

 

Read more RELATED
Recommended to you

Latest news