జంతువులను కాపాడటానికి మనుషులు కాస్త ఎక్కువగానే కష్టపడుతూ ఉంటారు. పిల్లి నుంచి ఏనుగు వరకు ఏదైనా జంతువు కష్టాల్లో ఉంటే చాలు దాన్ని కాపాడే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. తాజాగా ఒక ఏనుగుని మురికి గుంత లో నుంచి తీయడానికి గానూ ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు లో చేసిన ప్రయత్నం ఇప్పుడు ఆకట్టుకుంది. గంటల తరబడి 15 అడుగుల గుంత లో ఉన్న ఆ ఏనుగుని బయటకు తీసారు.
జేసీబీ తో దాన్ని బయటకు లాగారు. ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుధా రామన్ ఈ వీడియో ని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఒక రైతు.. ఏనుగుని గుంటలో పోరాడుతున్నట్లు గుర్తించాడు. దాన్ని బయటకు తీయడం తనకు సాధ్యం కాదని గుర్తించిన అతను అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న అధికారులు… ఎక్స్కవేటర్ ఉపయోగించి ఏనుగును గుంట నుండి బయటకు తీసుకు రావడానికి గానూ…
ఒక మురికి ర్యాంప్ను తయారు చేసారు. దీనితో అక్కడ ఉన్న వాళ్ళు అరుపులు కేకలతో సంబరాలు చేసుకున్నారు. అటవీ శాఖ ఏనుగుని రక్షించడానికి చేసిన ప్రయత్నాలను పలువురు అభినందించారు. “అద్భుత వీడియో మేడం. చివరికి ఏనుగుని రక్షించడం నిజంగా మంచి పరిణామం అని పేర్కొన్నారు. కాగా చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు విధ్వంశం సృష్టిస్తూ ఉంటుంది.
There is no hard& fast rule when it comes to Wildlife management. Every scenario &every case involving different species has to be handled differently at different times.
Here is a successful rescue operation of a Tusker done at Chittoor Division. Watch d last few seconds. Via WA pic.twitter.com/sXVa8I4wHB— Sudha Ramen IFS ?? (@SudhaRamenIFS) April 10, 2020